ఆదిపురుష్ పై లాక్ డౌన్ ప్రభావం…
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’పై లాక్ డౌన్ ప్రభావం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను ముందుగా ముంబైలో జరపాలనుకున్నారు. కానీ.. కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీగా కేసులు పెరిగిపోతుండడంతో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఈ మధ్యనే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను హైదరాబాద్ కు మార్చారు మేకర్స్.
అయితే హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ.. తెలంగాణలో తాజా పరిణామాలు ఆదిపురుష్ బృందాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయనే చెప్పాలి. ఇక్కడ కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించింది. కాగా ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘ఆదిపురుష్’ నిర్మాతలకు భారీ నష్టాన్నే మిగిల్చనుంది. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. టి సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.