ఆచార్య వాయిదా.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అందుకు సంబంధించి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఆచార్య సినిమాను మే 13న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు దేశం కరోనాతో చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. తిరిగి కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని కూడా పేర్కొంది. అలాగే అందరూ మాస్కులు ధరించండి, సురక్షితంగా ఇంట్లోనే ఉండండి అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. కాగా చరణ్ సరసన పూజా హెగ్డే కనువిందు చేయనుంది.