అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగతో జత కట్టారు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ను దుబాయ్లో కంప్లీట్ చేసుకుంది కూడాను. అక్కడ మహేష్ బాబుతో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు చిత్ర యూనిట్. అయితే అతి త్వరలో హైదరాబాద్లో ఈ మూవీ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే మధ్యలో వచ్చిన ఈ విరామ సమయంలో మహేష్ బాబు.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో నటించనున్నాడు. అదేమంటే… అది మూవీ కాదని తెలుస్తోంది. ఓ యాడ్ షూటింగ్ లో కలిసి వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. హావెల్స్ అనే ఎలక్ట్రిక్ బల్బుల కంపెనీ ప్రకటనలో మహేష్ నటించబోతున్నాడు. ఈ ప్రకటనకు సంబంధించి షూటింగ్ ఈ రోజు జరుగుతుంది. కాగా ఈ యాడ్ను సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో మహేష్ తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటించనుందని సమాచారం అందుతుంది.