అర్జున్ రెడ్డిని కాదని మదనపడుతున్న పార్వతి…!

సినిమాల్లో అవకాశాలు, స్టార్ స్టేటస్ అంతా టైం కలిసి రావాలి, లక్ ఉండాలి. అందుపట్టుకొనే నేర్పు ఉండాలి. ఇదే సందర్భం మలయాళ కుట్టి పార్వతీ నాయర్ కి ఎదురైంది. అమ్మడు తిరస్కరించిన ఓ సినిమా సెన్సేషనల్ హిట్ అయి ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా రూపొంది అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఆ సినిమానే మన విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిన ‘అర్జున్ రెడ్డి’. ఇంటిమసీ సీన్స్ తో పాటు లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువా ఉన్నాయనే కారణంగా అమ్మడు తన వద్దకు వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్ ని కాదనింది. ఈ మధ్య ఇన్స్టా చాట్ సెషన్లో ఓ అభిమాని ‘అర్జున్ రెడ్డి’ మిస్ చేసుకున్నందుకు బాధ పడుతున్నారా? అని అడిగాడు. అప్పుడు అమ్మడు ‘నిజంగానే బాధగా ఉంది. నిజానికి ఆ సినిమాను మిస్ చేసుకుని ఉండకూడదు. అదో అందమైన చిత్రం’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా అలాంటి అందమైన సినిమాలు మళ్లీ నా దరికి వస్తాయని ఖచ్చితంగా నమ్ముతున్నాను అని చెప్పేసింది. కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ, శాలిని పాండే ముఖ్య పాత్రలు పోషించగా… వారి కెరీర్స్ లో గుర్తుండిపోయే సినిమాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఇదే హిందీలో ‘కబీర్ సింగ్’, తమిళం ‘ఆదిత్య వర్మ’గా రీమేక్ అయి ఆయా భాషల్లో నటించిన వారికి కూడా మంచి పేరు తేవటం విశేషం. కాగా పార్వతి నాయర్ ‘ఉత్తమ విలన్, ఎన్నై అరింధాల్’ వంటి సినిమాలతో నటించినా తగినంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ప్రస్తుతం మరి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. మొత్తానికి పార్వతి నాయర్ అంతా అయిపోయాక జ్ఞానోదయం అయిందన్న మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *