అరియానాతో ఆర్జీవీ వర్కవుట్స్… మామూలుగా లేవుగా

సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అయితే ఆ పిక్స్ లో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీతో జిమ్ లో ఆర్జీవీ వర్కౌట్లు చేస్తుంది. అంతవరకు ఓకే… అవి మరీ బోల్డ్ గా ఉండటమే ఇప్పుడు అందరినీ షాకింగ్ కు గురిచేస్తున్న అంశం.
అయితే ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే… ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇదివరకు ఈ పిక్స్ తాలూకూ ట్రైల్స్ వదిలారు ఆర్జీవీ. మొదట అరియనా మొహం వెల్లడించకుండా ‘ఎవరో చెప్పుకోండి చూద్దాం’ అంటూ పలు పిక్స్ షేర్ చేశాడు ఆర్జీవీ. ఆ పిక్స్ చూసిన కొంతమంది అరియనా అని గుర్తుపట్టారు. అలాగే ఆ తర్వాత ఆమె అరియాననే అని పేర్కొంటూ మరిన్ని పిక్స్ షేర్ చేశారు. తనను అరియనా చేసిన ఇంటర్వ్యూ ‘అరియనా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ’ పేరుతో శుక్రవారం విడుదల కానుంది అని ప్రకటించారు. అయితే వర్మతో అరియనా ఇంటర్వ్యూ సంగతి తెలీదు కానీ పిక్స్ మాత్రం బోల్డ్ గానే ఉన్నాయి అంటూ బహు బాగుగా సోషల్ మీడియాలో కామెంట్స్ గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం… వీటిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తుండటం చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో అరియనా హీరోయిన్ అవుతుంది అనే అట్టే తెలిసిపోతుంది. చూద్దాం మరి ఆర్జీవీ ఆమెను ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *