అమెరికా నుంచి తిరిగొచ్చిన రజనీకాంత్….
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా నుంచి మళ్ళీ చెన్నైకి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఆయన రాకకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. జూన్ 19వ తేదీన తలైవా తన భార్యామణితో కలిసి చెన్నై నుంచి అమెరికాకు వెళ్లారు. అయితే రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్లారు. ఫ్లోరిడాలోని మాయో క్లినిక్ వైద్య కేంద్రంలో ఆయన ఉన్న పిక్స్ కూడా బయటకొచ్చి నెట్ లో చక్కర్లు కొట్టాయి.
అయితే తాజాగా రజనీకాంత్ చెన్నైకి తిరిగొచ్చిన పిక్స్ బయటకు వచ్చాయి. అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయంలో ఆయన కనిపించడంతో అక్కడే ఉన్న ఆయన అభిమానులు తీసిన ఫోటోలు, వీడియోలు ‘తలైవా రిటర్న్స్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో రజినీ నీలం రంగు చొక్కా, డెనిమ్ జీన్స్ టోపీ, వైట్ షూస్ ధరించి కన్పిస్తున్నారు. కాగా ప్రస్తుతం తలైవా తన భారీ ప్రాజెక్ట్ ‘అన్నాత్తే’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. త్వరలోనే రజినీకాంత్ తన తర్వాతి ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది.