అమెరికాలో మళ్లీ కాల్పులు…. 12 మంది మృతి
అమెరికా ప్రజలు ఓ పక్క కరోనాతో అల్లకల్లోలం అవుతుంటే.. మరో పక్క దుండగుల కాల్పుల మోతకు బలి అవుతున్నారు. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలో వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న కాల్పుల్లో 12 మంది మృతిచెందారు.
అయితే ఆదివారం అర్ధరాత్రి కొలరాడో పార్క్ లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కొలరాడోలో జరిగిన కాల్పుల్లో ఏకంగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. అలాగే ఉడ్ల్యాండ్లో పొరుగువారిపై ఓ వ్యక్తి కాల్పులు జరుపడంతో ముగ్గురు మృతి చెందారు. నిందితుడిపై పోలీసులు ఎదురుకాల్పులు చేయగా.. దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా కాల్పులకు గల కారణాలేమిటి అన్న విషయం తెలియడం లేదు. అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఎన్వైపీడీ కమిషనర్ డెర్మోట్ సియా తెలిపారు.