అమెరికాలో మళ్లీ కాల్పులు… 10 మంది మృతి

అమెరికాలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కాల్పుల కలకలం సృష్టించాయి. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ లో ఓ గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. బౌల్డర్ లోని ఓ మాల్ లోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
అయితే ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారితో పాటుగా మొత్తం 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. హఠాతుగా కాల్పులు జరగడంతో మాల్ లో ఉన్న వినియోగదారులు షాక్ కి గురి కావాల్సి వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే జరగాల్సిన ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న బౌల్డర్ పోలీసులు మాల్ వద్దకు చేరుకొని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియడం లేదు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.