అమీర్ ఖాన్ కొడుకుతో నాగ్ టేబుల్ టెన్నిస్….

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఓ స్టార్ హీరో కొడుకుతో టేబుల్ టెన్నిస్ ఆడిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ యువ నటుడు ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ నిమిత్తం లడఖ్ లో ఉన్నాడు. అయితే ‘లాల్ సింగ్ చద్దా’ సిబ్బంది మొత్తం ఈ మధ్య తమ ఖాళీ సమయంలో సెట్లో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, అమీర్ ఖాన్ పాల్గొన్న పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ప్రధాన నటుల నుంచి సెట్లో ఉన్న పిల్లల వరకు జట్టు మొత్తం సరదాగా గడిపారు. అంతేకాకుండా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమీర్ ఖాన్ మాజీ భార్య, నిర్మాత కిరణ్ రావు, తన కుమారుడు ఆజాద్ రావు ఖాన్తో కలిసి సెట్స్ లో టేబుల్ టెన్నిస్ ఆడారు. కాగా అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ‘లాల్ సింగ్ చద్దా’ 1994లో వచ్చిన టామ్ హాంక్స్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ అధికారిక హిందీ రీమేక్. ఇందులో కరీనా కపూర్ ఖాన్, మోనా సింగ్ కూడా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *