అమీర్ ఖాన్ కు కరోనా పాజిటివ్..
తాజాగా సోషల్ మీడియా నుండి వైదొలిగిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కి కరోనా సోకినట్టు ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని ఆయన తెలిపారు. అయితే ఈ మద్య కాలంలో ఆమిర్ ఖాన్ ను కలిసి వ్యక్తులు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు.
కాగా ఈ నెల మొదట్లో ఆమిర్ ఖాన్ ముంబైలో జరిగిన ‘కోయీ జానే నా’ మూవీ స్క్రీనింగ్ కు హాజరయ్యాడు. ఆయన ఆ సినిమాలోని ఓ పాటలో కూడా డ్యాన్స్ వేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా నుండి తాను వైదొగడంపై జరుగుతున్న ప్రచారానికి వివరణ కూడా ఇచ్చాడు. ఎవరికి వారు ఏదేదో ఊహించుకోవడం తగదని, తన ప్రపంచంలో తాను ఉండటానికే ఇష్టపడుతుంటానని, అందుకే సోషల్ మీడియాలో ఇకపై పోస్టులు పెట్టవద్దని అనుకుంటున్నానని ఆమిర్ ఆ సందర్భంగా స్పష్టం చేశారు. మొత్తానికి ఆమిర్ ఖాన్ కు కరోనా సోకడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడిందనే చెప్పాలి.
కాగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్ళు దాటిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అంగీకరించింది. తాజాగా ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 5,08,41,286 వ్యాక్సిన్లు అందించినట్టు భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అమెరికా, చైనా తర్వాత అత్యధిక వ్యాక్సిన్లు అందించిన దేశంగా ఇండియా మూడో స్థానంలో నిలవడం విశేషం. రోజుకు 30 లక్షల మందికి పైగా ఇండియాలో వ్యాక్సిన్ వేస్తున్నారు.