అమాంతం పెరిగిన బుచ్చిబాబు రెమ్యూనరేషన్

టాలీవుడ్ లో ఉప్పెనలో దూసుకువచ్చి అందరూ కొత్తవారితో విడుదలై సరికొత్త రికార్డులను సృష్టించిన సినిమా ఉప్పెన. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘ఉప్పెన’ సినిమా ఘనవిజయం సాధించడంతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీశెట్టి తమ రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేశారనే వార్తలు హల్ చల్ చేశాయి. ఆ వార్తల్లో నిజం లేకపోలేదని కూడా తెలుస్తోంది. అందుకు నిదర్శనం వీరిద్దరూ ఇప్పటికే కొన్ని సినిమాలలో ఆఫర్ లను దక్కించుకున్నారు. ఆయా సినిమాల షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది.
అయితే దర్శకుడు బుచ్చిబాబు తర్వాత తాను తీయబోయే సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం విశేషం. కొత్త హీరోహీరోయిన్లతో తీసిన ‘ఉప్పెన’ యాభై కోట్ల షేర్ వసూలు చేయడంతో, సహజంగానే దర్శకుడు బుచ్చిబాబుపై కూడా నిర్మాతలు దృష్టి సారించారు. కానీ ఎన్టీయార్ కు వీరాభిమాని అయిన బుచ్చిబాబు మాత్రం ఏ సినిమాకు కమిట్ కాలేదనే టాక్ నడుస్తోంది.
కానీ అన్నీ అనుకూలిస్తే సుకుమార్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీయార్ హీరోగా నిర్మించే సినిమాకి బుబ్చిబాబే దర్శకుడని కూడా తెలుస్తోంది. ఎన్టీయార్ కోసం బుచ్చిబాబు ఓ స్పోర్ట్స్ డ్రామాను తయారు చేశారని టాక్. అయితే ఇదే విషయంలో మరో వార్త కూడా హల్ చల్ చేస్తుంది. అదేమంటే… ఈ మూవీకోసం ఏకంగా బుచ్చిబాబుకు అక్షరాల రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని కూడా ఫిల్మ్ సర్కిల్ లో టాక్. ఎన్టీయార్ లాంటి మాస్ స్టార్ హీరోను డైరెక్ట్ చేసే వ్యక్తికి ఆ మాత్రం పారితోషికం ఇవ్వడం సహజమే అని కూడా ప్రచారం సాగుతుంది. మరి చూడాలి ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కించబోయే యంగ్ టైగర్ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో అనేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *