అనుష్క కోసం ఓటీటీ భారీ ఆఫర్… !
సినీ స్టార్స్ ఈ మధ్య వరసుగా ఓటీటీ బాట పట్టారు. ముఖ్యంగా హీరోయిన్లు తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, త్రిష, నయనతార వంటి స్టార్స్ ఓటీటీ బాట పట్టి దూసుకుపోతున్నారు. అయితే సౌత్ ఇండియా నంబర్ వన్ హీరోయిన్గా రాణించిన అనుష్క శెట్టికి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. అభిమానగణం కూడా ఎక్కువగా ఉంది. దీంతో టాలీవుడ్ లో అనుష్కకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం వుంటుంది. కాబట్టే నాలుగు పదుల వయసులో కూడా అనుష్క అంతే స్థాయి గ్లామర్, అదే క్రేజ్తో టాలీవుడ్లో తన మార్క్ సినిమాలతో దూసుకుపోతుంది.
అయితే ప్రస్తుతం ఆమె సినిమాల విషయానికి వస్తే నిశ్శబ్ధం తర్వాత.. అనుష్క నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ కూడా అధికారికంగా రాలేదు. దీంతో స్వీటీ డిజిటల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, త్రిష, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లందరూ డిజిటల్ లో బాగా రాణిస్తున్నారు. ఇదే అదునుగా అనుష్క డీజిటల్ రంగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ ఓటీటీ సంస్థ ఆమెకు భారీ ఆఫర్ కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. మరి చూడాలి అందరి స్టార్ హీరోయిన్ల వలె అనుష్క కూడా డిజిటల్ రంగంలోకి దిగుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.