అంధుడిగా విశ్వనటుడు….!

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘విక్రమ్’. ముఖ్యంగా జూలై 16వ తేదీన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చురుగ్గా సాగుతుంది. ‘విక్రమ్’ సినిమాకి దర్శకుడుగా లోకేష్ కనగరాజ్ వ్యవహరిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి టాలెంటెడ్ నటులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఫహద్ ఫాసిల్ షూటింగ్ లో చేరనున్నారు. ‘విక్రమ్’ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండగా, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీని, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘విక్రమ్’ సినిమాని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలని చూస్తుండటం విశేషం.

అదేవిధంగా ఈమధ్య మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ముగ్గురినీ చూపించారు. ‘విక్రమ్’ వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి రానున్నాడు. అంతేకాకుండా మూవీ ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటిగా చెప్పబడుతున్న విషయం ఏమిటంటే కమల్ హాసన్ అంధుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా 1981లో సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ‘రాజా పార్వై’లో కమల్ హాసన్ అంధుడి పాత్రలో నటించారు. ఇప్పుడు మరోసారి కమల్.. అంధుడి పాత్రను పోషించడపై ఆకస్తినెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *