అందుకే కరోనా అంతలా వ్యాపిస్తుంది…

దేశంలో రోజు రోజుకీ కరోనా వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. రోజుకి ఇంచుమించు లక్ష కరోనా కేసులు నమోదౌతున్నాయి అంటే తీవ్రత ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. దీంతో జాగ్రత్తలు పాటించాలని, కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది.
అదేవిధంగా మాస్క్ తో పాటుగా నిబంధనలు పాటించేలా చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో కరోనా వేగంగా విస్తరించడానికి కారణమైన బ్రిటన్ వేరియంట్ ఇండియాలో కూడా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా పంజాబ్ లో 80శాతం కేసుల్లో బ్రిటన్ వేరియంట్లు ఉన్నట్టు కేంద్రఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. వివాహాలు, వేడుకలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతుల ఆందోళన వంటి అంశాల కారణంగా కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్దన్ స్పష్టం చేశారు.