అందరి నేతల కొడుకులూ గెలిచారు.. ఈ స్టాన్ ఫోర్డ్ ప్రొడక్ట్ తప్ప…..

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడి పై నిప్పులు చెరిగారు. నారా లోకేష్ పై ఒక్కసారిగా విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని కీలక రాజకీయ నేతల కుమారులు రాజకీయాల్లో బాగా రాణిస్తుంటే.. లోకేష్ మాత్రం తుక్కైపోయాడని కౌంటర్ వేశారు. వైస్సార్ కుమారుడు రికార్డ్స్ సృష్టించారు. స్టాలిన్ కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు. కేసీయార్ కుమారుడు గెలిచాడు. ములాయం కుమారుడు గెలిచాడు. థాక్రే కుమారుడు గెలిచాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడు – స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్ అని బిల్డప్ ఇస్తాడు. తల్లిదండ్రులిద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినప్పుడు పిల్లలకు వ్యాధి సోకకుండా సిఎం జగన్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 32 బాలల సంరక్షణ సంస్థలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సంక్షోభ సమయంలో దేశంలోనే ఇటువంటి మానవత కనబర్చిన రాష్ట్రం మనది. యువ సిఎం ట్రెండ్ సెట్ చేశారు. ప్రభుత్వం వద్దని మొత్తుకున్నా కట్టప్ప లాంటి నిమ్మగడ్డను వాడుకుని స్థానిక ఎన్నికలు జరిపించాడు బాబు. కరోనా వ్యాప్తికి కుట్ర పన్నిన పాపం ఆయనను, పచ్చ బ్యాచిని వదిలి పెట్టదు. ఎన్నికలు లేకుంటే పాజిటివ్ కేసుల్లో రాష్ట్రం చిట్ట చివరన ఉండేది. ఇంత ఆందోళనకర పరిస్థితులు ఉండేవి కాదు’. అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
అంతేకాకుండా అంతకు ముందు ట్వీట్ లో ‘అగ్గి ఎక్కడ ఉందో అక్కడ నీళ్లు చల్లాలి. దిల్లీ వైపు చూసే ధైర్యం లేక రాష్ట్రంలో నీళ్లు కుమ్మరిస్తే జారి పడతావ్ చంద్రబాబు. ఇప్పటికే మోకాళ్లు విరగ్గొట్టుకుని నడవలేక పాకుతున్నావ్. మంచం పాలు కాకుండా చూసుకో. విశ్వసనీయత కోల్పోయాక గారడీలు చేసినా, నాటకాలాడినా వృథా ప్రయాస అవుతుంది’ అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్రంగా సుతిమెత్తని భావధారను విడిచారు. మరి ఇందుకు బాబు, లోకేష్ లు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *