అంతా శ్వాసమీద ధ్యాసపెట్టండి : అనుష్క

కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. ఈ సమయంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ జాగ్రత్తలు వహించాలంటూ ప్రజలను పలు రకాలుగా కోరుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా తమ సందేశాన్ని తెలియజేశారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమకు తాముగా స్వీయ నిర్బంధం విధించుకోవాలని కోరారు. అలాగే ప్రతిఒక్కరికీ వారి బాధలను ఎలా వ్యక్తపరచాలో తెలియకపోవచ్చు. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఇలాంటి సమయంలో మనకు పాజిటివ్ ఎనర్జీ అవసరం.. దానికోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి అంటూ స్వీటీ కోరారు. ముఖ్యంగా శ్వాసపై ధ్యాసపెట్టి తగిన వ్యాయామాలు చేస్తే కరోనాను ఎదుర్కోవచ్చునని ఆమె వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *